Virat Kohli : కోహ్లీకి గాయం? సెకండ్ టెస్ట్ నుంచి ఔట్!

by Sathputhe Rajesh |
Virat Kohli : కోహ్లీకి గాయం? సెకండ్ టెస్ట్ నుంచి ఔట్!
X

దిశ, స్పోర్ట్స్ : ఈ నెల 6 నుంచి ఆడిలైడ్‌లో భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్‌లో తలపడనున్నాయి. అయితే ప్రాక్టీస్ సందర్భంగా మోకాలికి గాయం కారణంగా బ్యాండేజ్ వేసుకుని కోహ్లి కనిపించాడు. తాజా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫొటో చూసిన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. అయితే కోహ్లీ మోకాలికి కట్టుతోనే నెట్ ప్రాక్టీస్ చేశాడు. పింక్ బాల్స్‌తో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. ఎలాంటి ఇబ్బందికి గురికాలేదు. కోహ్లీ సెకండ్ టెస్ట్ వరకు ఫుల్ ఫిట్‌గా ఉండాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.పెర్త్ టెస్ట్‌లో విరాట్ అద్భుతమైన సెంచరీతో రాణించి జట్టు చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ 11 జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కోహ్లీ ఆడలేదు. అడిలైడ్‌లో 8 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 63.62 యావరేజ్‌తో 509 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక అర్థ శతకం ఉన్నాయి. మరో సెంచరీ చేస్తే ఈ వేదికలో అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ టాప్‌లో నిలవనున్నాడు. ఒక వేళ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమైతే భారత్‌కు బిగ్ షాక్ అని చెప్పొచ్చు.

Advertisement

Next Story

Most Viewed