58 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ.. రికార్డు బద్దలయ్యేనా?

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-12 14:33:56.0  )
58 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ.. రికార్డు బద్దలయ్యేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన ఆటతీరుతో జట్టుకు అనేక విజయాలు అందించారు. ఎన్నో రికార్డులు సునాయాయంగా బ్రేక్ చేశారు. భారత్‌లో సచిన్ టెండుల్కర్ తర్వాత.. అంతటి రికార్డులు కోహ్లీ పేరుమీదే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా.. మరో అరుదైన రికార్డుకు విరాట్ కోహ్లీ అతి చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు ఆయన అంతర్జాతీయంగా.. 591 ఇన్సింగ్స్‌లో 26,952 పరుగులు చేశారు. మరో 58 పరుగులు చేస్తే అతి తక్కువ ఇన్సింగ్స్‌లో 27 వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తారు. ప్రస్తుతం సచిన్ టెండుల్కర్(623) పేరిట ఆ రికార్డు ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు సచిన్ టెండుల్కర్, కుమార్ సంగక్కర, రికీ పాంటింగ్ మాత్రమే 27 వేలకు పైగా పరుగులు చేశారు. మరో 58 పరుగులు చేస్తే వారి జాబితాలో కోహ్లీకి కూడా చోటు దక్కనుంది.

Advertisement

Next Story

Most Viewed