- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Virat Kohli : కోహ్లీ గాయం.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన గిల్

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలి గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. రెండో వన్డే ఆడతాడా?లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. రెండో వన్డే కోహ్లీ ఆడతాడని తెలిపాడు. డిస్నీ హాట్‌స్టార్‌తో గిల్ మాట్లాడుతూ..‘బుధవారం ప్రాక్టీస్‌లో కోహ్లీ బాగానే ఉన్నాడు. కానీ, గురువారం ఉదయం అతని మోకాలిలో వాపు కనిపించింది. అయితే, గాయం అంత సీరియస్ కాదు. అతను కచ్చితంగా రెండో వన్డేకు అందుబాటులోకి వస్తాడు.’ అని తెలిపాడు. ఆదివారం కటక్ వేదికగా రెండో వన్డే జరగనుంది.
ఒకవేళ రెండో వన్డేకు కోహ్లీ అందుబాటులోకి వస్తే అతన్ని తుది జట్టులోకి తీసుకోవడం ఖాయమే. అప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ శ్రేయస్ అయ్యర్ లేదా యశస్వి జైశ్వాల్‌లలో ఒకరిపై వేటు వేయక తప్పదు. తొలి వన్డేలో కోహ్లీ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అతన్ని పక్కనపెట్టకపోవచ్చు. జైశ్వాల్ 15 రన్సే చేసి నిరాశపరిచాడు. కాబట్టి, అతన్ని బెంచ్‌కే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, గత మ్యాచ్‌లో విరాట్ బ్యాటింగ్ చేసే 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ 87 పరుగులతో రాణించాడు. అయితే, కోహ్లీ తుది జట్టులోకి వస్తే గిల్ తిరిగి ఓపెనర్‌గా వెళ్లక తప్పదు.