IND VS BAN : అంపైర్ తప్పిదం.. కోహ్లీ నాటౌటే.. డీఆర్‌ఎస్ తీసుకోకపోవడంపై రోహిత్ అసహనం

by Harish |
IND VS BAN : అంపైర్ తప్పిదం.. కోహ్లీ నాటౌటే.. డీఆర్‌ఎస్ తీసుకోకపోవడంపై రోహిత్ అసహనం
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నాటౌట్ అయిన పెవిలియన్ చేరాడు. అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. అతను డీఆర్ఎస్ తీసుకోకపోవడం కూడా కొంపముంచింది. అసలేం జరిగిందంటే.. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే అవుటైన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. 37 బంతులు ఎదుర్కొని 17 స్కోరు వద్ద వెనుదిరిగాడు. మెహిది హసన్ మిరాజ్ వేసిన 20వ ఓవర్‌లో రెండో బంతికి విరాట్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. బంతి ఫ్రంట్ ప్యాడ్‌కు తగిలిందని బంగ్లా ప్లేయర్లు అప్పీలు చేయడంతో అంపైర్ అవుట్ ఇచ్చాడు. గిల్‌తో కాసేపు చర్చించిన తర్వాత విరాట్ పెవిలియన్ వైపు వెళ్లాడు. అయితే, రీప్లేలో మాత్రం బంతి స్పష్టంగా బ్యాట్ ఎడ్జ్‌కు తగిలినట్టు కనిపించింది. డీఆర్ఎస్ తీసుకుంటే నాటౌట్‌‌గా తేలేది. కానీ, కోహ్లీ డీఆర్‌ఎస్ తీసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ రోహిత్ కూడా షాక్ గురయ్యాడు. ‘రివ్యూ తీసుకోవాల్సింది కదా’ అన్నట్టు రోహిత్ అసహనం వ్యక్తం చేయడం వీడియోలో కనిపించింది. అంపైర్ తప్పిదంతోపాటు రివ్యూ తీసుకోకపోవడంతో కోహ్లీ వికెట్ పారేసుకోవాల్సి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed