వినేశ్‌ అప్పీలుపై తీర్పు.. ఈ నెలకు 13కు వాయిదా

by Harish |
వినేశ్‌ అప్పీలుపై తీర్పు.. ఈ నెలకు 13కు వాయిదా
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు చేరుకున్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన విషయం తెలిసిందే. తన అనర్హతను సవాల్ చేస్తూ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(కాస్)‌ను ఆశ్రయించిన వినేశ్.. రజతం ఇవ్వాలని అభ్యర్థించింది. వినేశ్ అప్పీలుపై విచారణ చేపట్టిన సోలో ఆర్బిట్రేటర్ డాక్టర్ అన్నాబెల్లె బెన్నెట్‌(ఆస్ట్రేలియా) తీర్పును ఈ నెల 13కు వాయిదా వేసింది. శనివారం రాత్రి 9:30 గంటలకు తీర్పు ఇస్తామని మొదట కాస్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీంతో తీర్పు కోసం అంతా వేచి చూశారు. తీరా సమయం ముగిసిన తర్వాత తీర్పును వాయిదా వేసినట్టు కాస్ అడ్ హక్ డివిజన్ తెలిపింది. విచారణకు వినేశ్ వర్చువల్‌గా పాల్గొంది. ఆమె తరపున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదుష్పత్‌ సింఘానియా వాదనలు వినిపించారు. వినేశ్‌కు అనుకూలంగా తీర్పు వస్తుందని భారత ఒలింపిక్ సంఘం ఆశిస్తున్నది. కాస్ ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేస్తామని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed