యూపీ వారియర్స్ జట్టులోకి ఆటపట్టు.. రూ.30లక్షలకు న్యాయం చేస్తుందా?

by Swamyn |
యూపీ వారియర్స్ జట్టులోకి ఆటపట్టు.. రూ.30లక్షలకు న్యాయం చేస్తుందా?
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక కెప్టెన్, ఆల్‌రౌండర్ చమరి ఆటపట్టు ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌ ఆడబోతుంది. తాజాగా ఆమె యూపీ వారియర్స్ జట్టులో చేరింది. యూపీ వారియర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంగ్లాండ్ పేసర్ లారెన్ బెల్ రెండో సీజన్‌ నుంచి వైదొలిగింది. దీంతో ఆమె స్థానంలో ఆటపట్టును తీసుకున్నట్టు ఫ్రాంచైజీ తెలిపింది. ఆటపట్టును కనీస ధర రూ. 30 లక్షలకు యూపీ వారియర్స్ జట్టులోకి తీసుకుంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో ఆటపట్టు రూ. 30 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చింది. అయితే, ఫ్రాంచైజీలు ఆమెను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది. ఐసీసీ వార్షిక అవార్డుల్లో మహిళల విభాగంలో ఆటపట్టు 2023కు సంబంధించి ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా, డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరగనుంది. ఫిబ్రవరి 24న యూపీ వారియర్స్ తన తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.


Advertisement

Next Story

Most Viewed