సౌతాఫ్రికా, ఐర్లాండ్ శుభారంభం

by Harish |
సౌతాఫ్రికా, ఐర్లాండ్ శుభారంభం
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా వేదికగా ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ టోర్నీలో ఆతిథ్య సౌతాఫ్రికా, ఐర్లాండ్ జట్లు శుభారంభం చేశాయి. గ్రూపు-బి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 285/9 స్కోరు చేసింది. డేవాన్ మరైస్(65)తోపాటు కెప్టెన్ జేమ్స్(47), డేవిడ్ టీగర్(44), ప్రిటోరియస్(40) రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన వెస్టిండీస్ 254 పరుగులకే ఆలౌటైంది. జ్యువెల్ ఆండ్రూ(130) సెంచరీతో పోరాటం చేసినప్పటికీ.. మిగతా బ్యాటర్లు తేలిపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్వెనా మఫాక(5/38) ఐదు వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, మరో మ్యాచ్‌లో అమెరికాపై ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా 105 పరుగులు చేయగా.. స్వల్ప లక్ష్యాన్ని ఐర్లాండ్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ర్యాన్ హంటర్(50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించడంతో 22.5 ఓవర్లలోనే ఐర్లాండ్ విజయతీరాలకు చేరింది.


Advertisement

Next Story

Most Viewed