Umar Akmal: 'నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా'.. కన్నీళ్లు పెట్టుకున్న పాక్ స్టార్‌ క్రికెటర్‌

by Vinod kumar |
Umar Akmal: నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న పాక్ స్టార్‌ క్రికెటర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: పాక్‌ క్రికెట్‌లో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న తరణంలో ఉమర్‌ అక్మల్‌.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదంలో చిక్కుకుని తన భవిష్యత్తును నాశనం చేసుకున్న విషయం తెలిసిందే. 2020లో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలు తనని సంప్రదించిన విషయాన్ని దాచిన అ‍క్మల్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల నిషేధం విధించింది. ఈ క్రమంలో అతడిపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని 12 నెలలకు కుదిస్తూ న్యాయస్ధానం తీర్పు వెల్లడించింది. దీంతో అతడిపై 2021లో పీసీబీ నిషేదం ఎత్తివేసింది. అయితే ఆ తర్వాత అతడికి పాక్‌ జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కలేదు. తాజాగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఉమర్‌.. తనపై నిషేదం ఉన్న సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

"ఆ సమయంలో నేను పడిన బాధ నా శత్రువులకు కూడా కలగకూడదు. ఆ దేవుడు కొన్ని సమయాల్లో మనల్ని పరీక్షిస్తాడు. నా రోజులు బాగోలేక నేను గడ్డుపరిస్ధితులు ఎదుర్కొన్నప్పుడు.. చాలా మంది అసలు రూపం బయటపడింది. నన్ను తప్పుబడుతూ నా పక్కన ఉన్నవారు కూడా వెళ్లిపోయారు. నేను ఆ సమయంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా కూతరి ఫీజు కట్టలేక ఎనిమిది నెలల పాటు స్కూల్‌కి పంపలేకపోయాను. అదే విధంగా నా భార్య ఓ సుసంపన్న కుటుంబంలో పుట్టింది. అయినప్పటికీ ఆ క్లిష్ట పరిస్ధితుల్లో ఆమె నన్ను అర్ధం చేసుకుని లా సపోర్ట్‌గా ఉండేది. ఆమెకి ఎప్పటికి రుణపడి ఉంటాను. ఆ రోజుల గురించి తలచుకున్నప్పుడల్లా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంటూ అక్మల్‌ ఉద్వేగానికి లోనయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed