- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అండర్-19 వరల్డ్ కప్ ఉత్తమ ప్లేయర్ రేసులో ముగ్గురు మనోళ్లే
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో ఓటమెరగని భారత జట్టు టైటిల్ నిలబెట్టుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఆదివారం ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ టోర్నీలో భారత కుర్రాళ్లు అంచనాలకు మించి రాణించారు. శుక్రవారం ఐసీసీ రిలీజ్ చేసిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు షార్ట్ లిస్ట్‌లో 8 మందిలో ముగ్గురు భారత కుర్రాళ్లే ఉండటం విశేషం. కెప్టెన్ ఉదయ్ సహారన్‌తోపాటు స్పిన్నర్ సౌమీ పాండే, బ్యాటర్ ముషీర్ ఖాన్ అవార్డు కోసం పోటీపడుతున్నారు.
ఈ టోర్నీలో సౌమీ పాండే ఆరు మ్యాచ్‌ల్లో 8.47 సగటుతో 17 వికెట్లు తీసుకున్నాడు. హయ్యెస్ట్ వికెట్ టేకర్ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు, కెప్టెన్ ఉదయ్ సహారన్ సారథిగానే కాకుండా ప్లేయర్‌గా సత్తాచాటుతున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో 64.83 సగటుతో 389 పరుగులు చేసిన అతను టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరో బ్యాటర్ ముషీర్ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 338 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే, సౌతాఫ్రికా నుంచి పేసర్ క్వెనా మఫాకా, బ్యాటర్ స్టీవ్ స్టోల్క్‌తోపాటు ఉబైద్ షా(పాకిస్తాన్), జెవెల్ ఆండ్రూ(వెస్టిండీస్), వ్యూ వీబ్జెన్(ఆస్ట్రేలియా) అవార్డు కోసం పోటీపడుతున్నారు.