- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యు ముంబా చేతిలో తెలుగు టైటాన్స్ చిత్తు
నోయిడా : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఓటమి పరంపర కొనసాగుతోంది. తాజాగా యు ముంబా చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. శనివారం నోయిడా వేదికగా జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ను 34-52 తేడాతో యు ముంబా చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి యు ముంబా ఆధిపత్యమే కొనసాగింది. ఏ దశలోనూ టైటాన్స్ పోరాట పటిమ కనబర్చలేకపోయింది. ఫస్టాఫ్‌లో 17-24తో వెనుకబడిన ఆ జట్టు సెకండాఫ్‌లోనూ పుంజుకోలేకపోయింది. మరోవైపు, దూకుడుగా ఆడిన యు ముంబా ఆటగాళ్లు టైటాన్స్‌ను మూడు సార్లు ఆలౌట్ చేసి భారీ విజయం అందుకున్నారు. రజ్‌నీష్(8), రాబిన్ చౌదరి, ప్రఫుల్ జవారే ఏడేసి పాయింట్లతో రాణించినప్పటికీ.. ఇతర ఆటగాళ్ల నుంచి సహకారం కరువైంది. మరోవైపు, యు ముంబా తరఫున గుమాన్ సింగ్(10), అమీర్(8), రింకు(8), సోంబిర్(8), జై భగవాన్(7) సమిష్టిగా రాణించారు. ఈ విజయంతో యు ముంబా వరుసగా నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుని పాయింట్స్‌లో 4వ స్థానంలో నిలిచింది. వరుస పరాజయాలతో తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ చివరి స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటికైనా పుంజుకుంటేనే నాకౌట్ రౌండ్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై 25-35 తేడాతో దబాంగ్ ఢిల్లీ కేసీ విజయం సాధించింది. ఢిల్లీ తరఫున కెప్టెన్ ఆషు మాలిక్ 11 పాయింట్లతో సత్తాచాటాడు.