- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: గ్లెన్ ఫిలిప్స్ అద్భుతం.. గాల్లో పక్షిలా ఎగురుతూ సూపర్ క్యాచ్ (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: ‘గ్లెన్ ఫిలిప్స్’ (Glenn Phillips).. అతడిని మనిషి అనడం కన్నా.. పక్షి అనడం మేలేమో. తాజాగా ఇంగ్లాండ్ (England), న్యూజిలాండ్ (New Zealand) మధ్య క్రైస్ట్‌చర్చ్ (Christchurch) వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 52 ఓవర్లో న్యూజిలాండ్ (New Zealand) పేసర్ టిమ్ సౌథి (Tim Southee) రెండో బంతిని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఒల్లీ పోప్ (Ollie Pope)కు ఆఫ్ స్టంప్ అవతల వేశాడు. దీంతో అతడు బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడగా.. ఆ బంతిని గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) గాల్లో పక్షిలా ఎగురుతూ ఒడిసి పట్టాడు. మైదానంలో ఆ క్యాచ్ చూసిన ఇంగ్లాండ్ (England) ఫాన్స్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అద్భుతమైన క్యాచ్ పట్టిన గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips)ను సహచార ఆటగాళ్లు అభినందించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఇన్నింగ్స్‌లో పోప్ 98 బంతుల్లో 77 పరుగులు చేసి అవుటయ్యాడు.