వరల్డ్ అథ్లెటిక్స్ కీలక నిర్ణయం..

by Vinod kumar |
వరల్డ్ అథ్లెటిక్స్ కీలక నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం విషయంలో వరల్డ్ అథ్లెటిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల ఎలైట్ పోటీల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా వరల్డ్ అథ్లెటిక్స్ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. డిఫరెన్సెస్ ఇన్ సెక్స్ డెవలప్‌మెంట్ (డీఎస్డీ) ఉన్న ప్లేయర్‌లపై కఠినమైన ఆంక్షలు విధించాలని వరల్డ్ అథ్లెటిక్స్ నిర్ణయించింది. ఇకపై మహిళా విభాగంలో పోటీ పడే క్రీడాకారుల ప్లాస్మా టెస్టోస్టెరాన్‌.. లీటరుకు 2.5 నానోమోల్స్ ఉండాలని నిర్ణయించారు.

ఇంతకుముందు లీటరుకు 5 నానోమోల్స్‌గా ఉండేది. క్రీడల్లో మహిళా విభాగాన్ని కాపాడాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో తెలిపారు. ఈ విభాగంలో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడం వల్ల వచ్చే సమస్యలపై ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్లను కూడా మహిళల విభాగంలో ఆడించడం సమంజసం కాదని.. ఈ క్రీడల్లో తమ శరీర ధారుడ్యం వల్ల ట్రాన్స్‌జెండర్లు సులభంగా పైచేయి సాధిస్తారని వరల్డ్ అథ్లెటిక్స్ అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed