‘టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్’లో ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు..

by Vinod kumar |   ( Updated:2023-12-26 14:53:47.0  )
‘టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్’లో ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు..
X

న్యూఢిల్లీ : ఈ ఏడాది టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో స్టార్ స్పార్ట్స్ చానెల్ మంగళవారం ‘టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2023’‌ను ప్రకటించింది. భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య సిరీస్‌కు బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ స్పోర్ట్స్.. తొలి టెస్టు జరిగే సమయంలో ఈ టీమ్‌ను రివీల్ చేసింది. ఈ జట్టులో ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. ఓపెనర్‌గా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఎంపికవ్వగా.. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ సెలెక్ట్ అయ్యారు. ఆస్ట్రేలియా నుంచి అత్యధిక నలుగురికి (ఉస్మాన్ ఖవాజా, పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్‌, మిచెల్ స్టార్క్)కి చోటు దక్కించుకోగా.. ఇంగ్లాండ్ నుంచి జో రూట్, జానీ బెయిర్ స్టో, స్టువర్ట్ బ్రాండ్ స్థానం సంపాదించారు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్‌కు చోటు దక్కింది.

అయితే, టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ ఏడాది కోహ్లీ 8 టెస్టులో 59.10 సగటుతో 591 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలతోపాటు ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఈ ఏడాది అద్భుతంగా రాణించిన కోహ్లీని పక్కనపెట్టడంతో భారత అభిమానులు మండిపడుతున్నారు. భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఏడాది 55 టెస్టు సగటుతో రాణించిన కోహ్లీకి టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో చోటు దక్కకపోవడం తనను షాకింగ్‌గా ఉందని చెప్పాడు.

Read More..

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. భారత్ తరఫున ఆమెదే టాప్ ర్యాంక్

Advertisement

Next Story

Most Viewed