- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైవర్స్ తర్వాత సానియా మీర్జా ఫస్ట్ ఇన్ స్టా పోస్ట్ ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో ఇటీవల డైవర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు క్రీడాకారులకు 2010లో వివాహం అవగా ఇజ్హాన్ మిర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే విడాకుల తర్వాత సానియా తన తొలి ఫొటోను ఇన్ స్టా వేదికగా పంచుకుంది. ‘రిఫ్లెక్ట్’ (ప్రతిబింబం) అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఇక, జనవరి 21న సానియా టీం షోయబ్ మాలిక్‌తో గత కొన్ని నెలలుగా సానియా దూరంగా ఉంటుందని తెలిపింది. అయితే దుబాయ్‌లో గతేడాది ఈ జంట తమ కుమారుడి 5వ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అస్ట్రేలియన్ ఓపెన్‌లో తన చివరి గ్రాండ్ స్లామ్‌ను సైతం సానియా ఆడారు. ఈ సందర్భంగా మాలిక్ సోషల్ మీడియాలో ఓ హార్ట్ ఫెల్ట్ నోట్ రాసుకొచ్చారు. సానియా కెరీర్‌లో సాధించిన విజయాలను షోయబ్ అందులో గుర్తు చేశారు. వీరిద్దరు కలిసి యూఏఈలో ఓ టాక్ షో సైతం నిర్వహించారు. విడాకులపై ఇన్ స్టా స్టోరీలో సానియా ఓ కొటేషన్ పెట్టుకుంది.
‘పెళ్లి కష్టం.. విడాకులు కష్టం.. ఊబకాయం కష్టం ఫిట్‌గా ఉండటం కష్టం. అప్పులు చేయడం కష్టం ఆర్థికంగా క్షమశిక్షణతో ఉండటం కష్టం. కమ్యూనికేషన్ కష్టం.. కమ్యూనికేట్ చేయకపోవడం కష్టం. జీవితం ఎప్పటికి సులభంగా ఉండదు. ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. తెలివిగా మీ జీవితాన్ని ఎంచుకోండి’ అంటూ తన ఆలోచనలు పంచుకుంది. సానియా పోస్ట్‌పై ఆమె ఫ్యాన్స్ స్పందిస్తూ ‘ఇంత అందమైన మహిళను ఎలా వదిలిపెట్టాలని అనిపించింది.’ అంటూ షోయబ్ మాలిక్‌పై ఫైర్ అవుతున్నారు.