Paris Paralympics : సంచలనం సృష్టించిన ప్రీతి పాల్.. పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మూడో పతకం

by Harish |
Paris Paralympics : సంచలనం సృష్టించిన ప్రీతి పాల్.. పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మూడో పతకం
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో రెండో రోజు భారత్ పతక ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. షూటింగ్‌లో అవనీ లేఖరా స్వర్ణం సాధించగా.. మోనా అగర్వాల్ కాంస్యం దక్కించుకుంది. శుక్రవారం భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. భారత మహిళా అథ్లెట్ ప్రీతి పాల్ 100 మీటర్ల రేసులో కాంస్యం గెలుచుకుంది. 100 మీటర్ల పరుగు పందెంలో పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి పతకం. దీంతో ట్రాక్ ఈవెంట్స్‌లో దేశానికి తొలి మెడల్ అందించిన అథ్లెట్‌గా ప్రీతి చరిత్ర సృష్టించింది. 100 మీటర్ల టీ35 ఈవెంట్‌లో బరిలోకి దిగిన ప్రీతి రేసు 14.21 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో ప్రీతి కాంస్యం కొల్లగొట్టింది

Advertisement

Next Story