- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతగా మద్దతు లభించలేదు: తండ్రి టీమిండియా ఆశలపై సర్ఫరాజ్ వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: అరంగేట్ర మ్యాచ్ లో అదరగొట్టాడు యువ బ్యాటర్ సర్ఫరాజ్. ఇంగ్లాండ్ తో టెస్టులో 62 పరుగులతో అదరహో అన్పించాడు. దేశం కోసం టెస్టు ఆడటం తన జీవితంలో గర్వించదగ్గర క్షణమని అన్నాడు. ఆరేళ్ల వయసులో క్రికెట్ జర్నీ ప్రారంభించిన సర్ఫరాజ్ సరిగ్గా.. రెండు దశాబ్దాల తర్వాత జాతీయజట్టులోకి వచ్చాడు. అంతర్జాతీయ ఆటగాడిగా ఎదగాలనేది తన తండ్రి కల అని అన్నాడు.
భారత్‌కు ఆడాలనేది తన తండ్రికల అని.. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల అది జరగలేదని తెలిపాడు. అప్పుడు తన ఇంటి నుంచి పెద్దగా మద్దతులేదని వివరించాడు. తనకోసం తన తండ్రి చాలా కష్టపడ్డాడని.. ఇది తన జీవితంలో గర్వించదగ్గ క్షణమని అతను వివరించాడు. తన తండ్రి ముందు దేశం కోసం ఆడినందుకు ఆనందంగా ఉందన్నాడు. తన మనసులో పరుగులు, ప్రదర్శన గురించి ఎలాంటి ఆలోచన లేదన్నాడు.
టెస్టు మ్యాచ్ కోసం దాదాపు నాలుగు గంటలు డ్రెస్సింగ్ రూంలో వేచి ఉన్ననని తెలిపాడు. జీవితంలో చాలా ఓపికగా ఉన్నానని తెలిపాడు. క్రీజులోకి వెళ్లిన తర్వాత కొన్ని బంతులు ఎదుర్కొనేందుకు భయపడినట్లు తెలిపాడు. చాలా ప్రాక్టీస్ తన ఎక్సీపీరియన్స్ ని తెలిపాడు సర్ఫరాజ్. తన తండ్రి రాజ్ కోట్ వచ్చేందుకు సిద్ధంగా లేడన్నాడు. కానీ కొందరు పట్టుబట్టడంతో ఆయన వచ్చినట్లు తెలిపారు. తన తండ్రి ముందు క్యాప్ అందుకున్నప్పుడు ఆయన చాలా భావోద్వేగానికి గురైనట్లు తెలిపాడు సర్ఫరాజ్.
ఏళ్ల తరబడి దేశవాళీ క్రికెట్‌లో పరుగులు సాధిస్తూ.. జాతీయ జట్టులో అవకాశం రాకపోతే అది ఏ ఆటగాడికి అంత సులభం కాదన్నాడు. మొదట్లో తాను చాలా కాలంగా ఎదురుచూడటం వల్ల ఇబ్బందిగా అనిపించిందన్నాడు. కానీ తర్వాత అవన్నీ పట్టించుకోలేదని.. అంతగా కష్టం అన్పించలేదన్నాడు.