క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-17 03:06:51.0  )
క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్
X

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ టీ20 టోర్నీలో పెను సంచలనం చోటు చేసుకుంది. సిడ్నీ థండర్ జట్టు కేవలం 15 పరుగులకే కుప్పకూలి క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ప్రొఫెషనల్ టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. కాగా అలెక్స్ హేల్స్, రిలీ రొసో లాంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్న జట్టు ఇంత పేలవ ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 2019లో చెక్ రిపబ్లిక్ పై టర్కీ 8.3 ఓవర్లలో 21 పరుగులకే ఆలౌటై నెలకొల్పిన ప్రపంచ రికార్డును సిడ్నీ థండర్ జట్టు బద్దలు కొట్టింది. ఆడిలైడ్ స్ట్రైకర్స్ తో మ్యాచ్ లో ఆ జట్టు ఇన్నింగ్స్ కేవలం 5.5 ఓవర్లలోనే ముగిసింది. టీ20ల్లో అతి తక్కువ ఓవర్లకు ఇన్నింగ్స్ ముగిసిన జట్టుగా థండర్స్ రికార్డులకెక్కింది. మొదట స్ట్రైకర్స్ 9 వికెట్లకు 139 పరుగులు చేశారు. థండర్స్ జట్టులో నలుగురు డకౌట్ కాగా ముగ్గురు ఒక్క పరుగుకే ఔటయ్యారు. 4 పరుగులు చేసిన డాగెట్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Also Read...

Hussain Bolt పరంపరను బద్దలు కొట్టిన Neezer Chopra

Advertisement

Next Story

Most Viewed