మహామహులకు సాధ్యం కాని రికార్డ్ నెలకొల్పిన కివీస్ బ్యాట్స్‌మెన్.. అతనొక్కడే!

by Shiva |   ( Updated:2024-02-16 05:11:31.0  )
మహామహులకు సాధ్యం కాని రికార్డ్ నెలకొల్పిన కివీస్ బ్యాట్స్‌మెన్.. అతనొక్కడే!
X

దిశ, వెబ్‌డెస్క్: లిటిల్ మాస్టర్, సచిన్ టెండుల్కర్, బ్రియాన్ లారా, రికీ పాంటింగ్, జాక్ కల్లిస్ లాంటి మహామహులకు సాధ్యం కాని రికార్డును న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ సాధ్యం చేసి చూపించాడు. నిలకడైన ఫాంతో గత మూడు నెలలుగా గాయం వేధించినా తిరిగి మైదానంలోకి వండర్ రికార్డ్ క్రియేట్ చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా 32 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. కేవలం 172 ఇన్నింగ్స్‌ల్లోనే విలియమ్సన్ కేన్ మామ ఈ ఘనతను సాధించాడు. ఇదే రికార్డు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ పేరున ఉండేది.

అతడు 174 ఇన్నింగ్స్‌‌ల్లో 32 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో వేగంగా 32 సెంచరీలు సాధించిన జాబితాలో విలియమ్సన్, ఆస్ట్రేలియా నుంచి స్టీవ్ స్మిత్, రికీ పాంటింగ్ (176 ఇన్నింగ్స్), భారత్ నుంచి సచిన్ టెండూల్కర్ (179 ఇన్నింగ్స్), పాకిస్థాన్ నుంచి యునిస్ ఖాన్ (183 ఇన్నింగ్స్) ఉన్నారు. కేన్ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి విలియమ్సన్ 45 సెంచరీలు బాదాడు. కేన్ విలియమ్సన్ కంటే ముందు విరాట్ కోహ్లి (80), డేవిడ్ వార్నర్ (49), రోహిత్ శర్మ (47), జో రూట్ (46) మాత్రమే ఉన్నారు. అయితే, కేవలం 12 ఇన్నింగ్స్‌ల్లో విలియమ్సన్ ఏడు సెంచరీలు సాధించడం కూడా ఊహకు అందనిది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed