వర్షంతో ఆగిన ఆట..3 వికెట్లు కోల్పోయిన భారత్

by Y. Venkata Narasimha Reddy |
వర్షంతో ఆగిన ఆట..3 వికెట్లు కోల్పోయిన భారత్
X

దిశ, వెబ్ డెస్క్ : న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వర్షంతో ఆట ఆగే సమయానికి 12.4 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాటర్లు కివీస్ పేస్ బౌలింగ్ ధాటికి ఇబ్బంది పడ్డారు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్ రోహిత్ శర్మ(2) విఫలమవ్వగా, కోహ్లీ, సర్ఫరాజ్ లు డకౌట్ గా వెనుతిరిగారు. చాలారోజుల తర్వాత తుది జట్టులో అవకాశం దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. వర్షం రావడంతో ఆటను నిలిపేయగా, ప్రస్తుతం క్రీజ్ లో రిషబ్ పంత్ (3), యశస్వి జైస్వాల్ (8) ఉన్నారు. కివీస్ బౌలర్లు సౌథీ, హెన్రీ, రూర్కీ తలో వికెట్ పడగొట్టారు.

తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ కేవలం 9 బంతులను మాత్రమే ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా ఓ చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయంగా 38వ సారి కోహ్లీ డకవుట్ కాగా, ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో టిమ్ సౌథీ (38)తో సమంగా నిలిచాడు. వీరిద్దరి తర్వాత రోహిత్ శర్మ (33) ఉన్నాడు. అన్నిఫార్మాట్లు కలిపి ముత్తయ్య మురళీ ధరన్ (59) డకౌట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ తో టీమ్ ఇండియా తరపున ఆత్యధిక మ్యాచులు ఆడిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. తుది జట్టులో స్థానం సంపాదించిన జాబితాలో సచిన్ అందరికంటే ఎక్కువగా ఉన్నాడు. సచిన్ 664 మ్యాచులు ఆడగా.. విరాట్ కోహ్లి 536తో రెండో స్థానంలో ఉన్నాడు. ఎంఎస్ ధోనీతో (535), రాహుల్ ద్రవిడ్ (504) నాలుగు, ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ (486) ఐదో స్థానాల్లో ఉన్నారు.

Advertisement

Next Story