అదరగొడుతున్న తెలంగాణ కుర్రాడు తరుణ్

by Harish |
అదరగొడుతున్న తెలంగాణ కుర్రాడు తరుణ్
X

దిశ, స్పోర్ట్స్ : కజకిస్తాన్‌ వేదికగా జరుగుతున్న కజకిస్తాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ షట్లర్ మన్నెపల్లి తరుణ్ అదరగొడుతున్నాడు. శుక్రవారం మెన్స్ సింగిల్స్‌లో క్వార్టర్స్, సెమీస్‌లను దాటి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మొదట క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తరుణ్ 22-20, 21-14 తేడాతో 4వ సీడ్, కజకిస్తాన్‌ షట్లర్ డిమిత్రి పనారిన్‌పై విజయం సాధించాడు. ఆ తర్వాత సెమీస్‌లో వియత్నంకు చెందిన లె డక్ ఫట్‌ను 8-21, 7-21 తేడాతో చిత్తు చేసి ఫైనల్ బెర్త్‌ను సాధించాడు. క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌లో తరుణ్ కంటే మెరుగైన ర్యాంకర్లను ఓడించడం విశేషం. శనివారం జరిగే టైటిల్ పోరులో మలేషియా ప్లేయర్ సూంగ్ జూ వెన్‌తో తరుణ్ తలపడనున్నాడు.

ఉమెన్స్ సింగిల్స్‌లో యువ క్రీడాకారిణి అనుపమ ఉపాధ్యాయ ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఆమె 24-22, 21-16 తేడాతో జపాన్ క్రీడాకారిణి సొరానో యషికావాపై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌ల్ సంజయ్ శ్రీవాస్తవ ధన్‌రాజ్-మనీష జోడీ సైతం టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో భారత జంట 21-16, 10-21, 21-14 తేడాతో 2వ సీడ్ కొసిలా మమ్మెరి-టానినా మమ్మెరి(అల్జీరియా) జోడీపై గెలుపొందింది.

Advertisement

Next Story

Most Viewed