కుంభమేళాలో భారత క్రికెటర్లు.. అఘోరాలకంటే భయంకరంగా గెటప్స్!

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-21 12:43:31.0  )
కుంభమేళాలో భారత క్రికెటర్లు.. అఘోరాలకంటే భయంకరంగా గెటప్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళ(Maha Kumbh Mela) అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌‌(Prayagraj)లోని త్రివేణి సంగమంలో రోజూ కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు(Indian Cricketers) రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli), రవిశాస్త్రి, సచిన్ టెండుల్కర్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, శ్రేయాస్ అయ్యార్, దినేశ్ కార్తీక్, జస్త్ప్రీత్ బూమ్రా, హార్దిక్ పాండ్యా(Hardik Pandya), మహ్మద్ షమీ, ఎమ్ఎస్ ధోనీ(MS Dhoni), మహ్మద్ సిరాజ్, రాహుల్ డ్రావిడ్, సూర్యకుమార్ యాదవ్‌లు అఘోరా(Aghora)ల గెటప్‌లో మహా కుంభమేళాను సందర్శించినట్లు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీటిని గమనించిన నెటిజన్లు అఘోరాల కంటే వీళ్లే ఎక్కువ భయంకరంగా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, దినేశ్ కార్తీక్‌లకు అఘోరాల గెటప్ బాగా సెట్ అయిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ప్రయాగ్‌రాజ్‌లో పోలీస్ డ్యూటీలో ఉన్న డీఎస్పీ మహ్మద్ సిరాజ్ ఫొటో కూడా అద్భుతంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. మహాకుంభ మేళాలో ప్రముఖ ఆధ్యాత్మిక సేవా సంస్థ ‘ఇస్కాన్‌’, అదానీ గ్రూప్‌తో కలిసి ప్రతినిత్యం లక్షమంది భక్తులకు భోజనాలు సమకూరుస్తోంది. తమ శిబిరాల్లో ఈ భోజనాలు వండి ప్రయాగ్‌రాజ్‌లోని కేంద్రాలకు చేరవేస్తోంది. ఆహారం పంపిణీకి అదానీ గ్రూపు వంద వాహనాలు, వాలంటీర్లను ఏర్పాటు చేసింది.

Advertisement
Next Story

Most Viewed