బంగ్లాతో టెస్టు సిరీస్.. ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత క్రికెటర్లు

by Harish |
బంగ్లాతో టెస్టు సిరీస్.. ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత క్రికెటర్లు
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు టీమ్ ఇండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. చెన్నయ్ వేదికగా ఈ నెల 19 నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటితోపాటు ఇతర క్రికెటర్లు గురువారమే చెన్నయ్‌లో అడుగుపెట్టారు. విరాట్ కోహ్లీ లండన్ నుంచి నేరుగా వచ్చాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత క్రికెటర్లు తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతని ఇదే తొలి టెస్టు సిరీస్.

కొత్త బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ జట్టుతో కలిశారు. విరాట్ దాదాపు 45 నిమిషాలపాటు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. భారత ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. రోహిత్ సేన దాదాపు ఆరు నెలల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడబోతున్నది. చివరిసారిగా మార్చిలో ఇంగ్లాండ్‌‌తో మూడో టెస్టు ఆడింది.

Advertisement

Next Story

Most Viewed