ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియా పై సస్పెన్షన్ వేటు

by Mahesh |   ( Updated:2024-06-23 08:09:44.0  )
ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియా పై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియాను యాంటీ డోపింగ్ ఏజెన్సీ సస్పెండ్ చేసింది. ఆటకు ముందు డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించాడని నిర్ధారణ వచ్చిన అతనిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా అతను 23 ఏప్రిల్ 2024న బజరంగ్ పునియా తన శాంపిల్‌ను యాంటీ డోప్ టెస్ట్ కోసం ఇవ్వడానికి నిరాకరించడంతో NADA తాత్కాలికంగా బజరంగ్ పునియాను సస్పెండ్ చేసింది. గతంలో NADA సస్పెండ్ చేసిన ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియాపై జూన్ 23 ఆదివారం మరోసారి తాత్కాలికంగా నిషేధం విధించారు.

NADA ప్రకారం, మార్చి 10న సోనిపట్ వద్ద ట్రయల్స్ సమయంలో బజరంగ్ తన మూత్ర నమూనాను ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ తర్వాత అతను డోప్ నియమాన్ని ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేయబడ్డాడు. బజరంగ్ తరపు న్యాయవాది విషుస్పత్ సింఘానియా మాట్లాడుతూ."అవును మేము నోటీసు అందుకున్నాము, దానిపై ఖచ్చితంగా స్పందిస్తాము. మేము గతంలో కూడా విచారణకు హాజరయ్యాము. ఈసారి కూడా మేము మా సమాధానం దాఖలు చేస్తాము. అతను ఏ తప్పు చేయలేదు కాబట్టి పోరాడతాము" అని బజరంగ్ తరపు న్యాయవాది చెప్పారు. నోటీసుపై స్పందించేందుకు బజరంగ్‌కు జూలై 11 వరకు గడువు ఉందని గుర్తు చేశారు.

బజరంగ్‌కు పంపిన నోటీసులో నాడా ఇలా పేర్కొంది

"చాపెరోన్/DCO పునియాను సంప్రదించి డోప్ విశ్లేషణ కోసం అతని మూత్ర నమూనాను ఇవ్వమని కోరాము. కానీ అతను మేము ఎన్నిసార్లు అభ్యర్థించినప్పటికి మూత్ర నమూనాను అందించడానికి నిరాకరించాడు. దీంతో అతనిపై NADA 2021 ప్రకారం.. చర్యలు తీసుకున్నామని బజరంగ్‌కు పంపిన నోటీసులో యాంటీ డోపింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది.

డోపింగ్ టెస్ట్ అంటే..?

డోప్ టెస్టును ఆయా ప్లేయర్లు తమ ప్రదర్శనకు ముందు ఎక్కువ ఎనర్జీని అందించే డ్రగ్స్, మందులు లాంటివి తీసుకున్నారా లేదా అని పరిశీలించడానికి ప్లేయర్, రక్తం, మూత్రం నమునాల ద్వారా చేస్తారు. ఈ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారిపై ఆ గేమ్స్ ఆడటం నిషేధం విదిస్తారు. ప్రతి ప్లేయర్ కచ్చితంగా డోపింగ్ టెస్ట్ క్లియరెన్స్ పొందాల్సిందే.

Advertisement

Next Story