ఐసీసీ అవార్డుకు నామినేట్ అయిన జైశ్వాల్.. కివీస్, శ్రీలంక ఆటగాళ్లతో పోటీ

by Harish |
ఐసీసీ అవార్డుకు నామినేట్ అయిన జైశ్వాల్..  కివీస్, శ్రీలంక ఆటగాళ్లతో పోటీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేసులో నిలిచాడు. ఫిబ్రవరికి సంబంధించిన అవార్డు నామినీలను ఐసీసీ సోమవారం ప్రకటించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు జైశ్వాల్ నామినేట్ అవడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేసిన జైశ్వాల్ ఈ అవార్డుకు ప్రధాన పోటీదారుడిగా ఉన్నాడు. అతనితోపాటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, శ్రీలంక బ్యాటర్ పాథుమ్ నిస్సాంక అవార్డు కోసం పోటీపడుతున్నారు.

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో జైశ్వాల్ అదరగొడుతున్నాడు. నాలుగు టెస్టుల్లో 93.57 సగటుతో 655 పరుగులు చేశాడు. ఫిబ్రవరిలో మూడు టెస్టుల్లో పాల్గొనగా 112 సగటుతో 560 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. వైజాగ్, రాంచీ టెస్టుల్లో టీమ్ ఇండియా విజయం సాధించడంలో జైశ్వాల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసీసీ అతన్ని ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ చేసింది.

Advertisement

Next Story