- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోరాహోరి పోరులో భారత్ ఓటమి.. ఫలించిన డికాక్ పోరాటం
దిశ, స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా పర్యటన టీం ఇండియాకు కలిసిరాలేదు. టెస్టు, వన్డే సిరీస్‌ను సఫారీ జట్టు ఇప్పటికే తమ ఖాతాలో వేసుకోగా ఆదివారం జరిగిన చివరి వన్డేతో భారత్ తన పోరాటాన్ని ముగించింది. గత రెండు మ్యాచులతో పోలిస్తే మూడో మ్యాచులో భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచారు. ఒకానొక దశలో భారత్ విజయం సాధిస్తుందని, టీం ఇండియా పరువు నిలబడుతుందని అంతా ఆశించారు. చివరి ఓవర్లలో సఫారీ బౌలర్లు కట్టుదిట్టం చేయడంతో మన ఆటగాళ్ల పాచికలు పారలేదు. హోరాహోరిగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా జట్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయగా టీం ఇండియా వైట్‌వాష్ అయ్యింది. చివరి వన్డేలో భారత్ గెలుస్తుందని నమ్మకంగా ఉన్న అభిమానులు మరోసారి జట్టు ఓటమి పాలవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికా పర్యటన భారత్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు బీసీసీఐ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంతో మూడు సిరీస్‌లను ప్లాన్ చేసింది. అయితే, ఈ మూడింటిలో దక్షిణాఫ్రికా పర్యటన మినహా మిగతా రెండు హోం గ్రౌండ్స్‌లోనే జరగనున్నాయి. భారత్ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో కనబరిచిన ఆట తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భాతర మాజీ ఆటగాళ్లు టీమిండియా ఆటగాళ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను 2-1తో కోల్పోయిన భారత్.. తాజాగా వన్డే సిరీస్‌ను 3-0 కోల్పోయి పరువు పోగొట్టుకుంది.
టాస్ గెలిచి మ్యాచ్ ఓడిన భారత్..
ఆదివారం జరిగిన చివరి వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టుకు.. సఫారీలు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. 130 బంతుల్లో 124 పరుగులు సాధించాడు. అందులో 12 ఫోర్లు ఉండగా, 2 సిక్సులు ఉన్నాయి. మరో ఓపెనర్ మలన్ -1, కెప్టెన్ బవుమా -0 రనౌట్‌తో వెనుదిరిగాడు. డికాక్ దూకుడు బుమ్రా కళ్లెం వేయగా.. ఆ తర్వాత డస్సెన్ -52/59, మిల్లర్ -39/38 పరుగుల భాగస్వామ్యం అందించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
చివరి క్షణంలో భారత్ ఓటమి..
దక్షిణాఫ్రికా నిర్దేశించిన పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత ఆటగాళ్లు గత మ్యాచులతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబరిచారు. కెప్టెన్ రాహుల్ త్వరగానే వెనుదిరిగినా.. ఓపెనర్ ధావన్- 61, కోహ్లీ-65 మంచి భాగస్వామ్యంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరి పార్ట్నర్ షిప్ బ్రేక్ అవ్వడంతో క్రీజులోకి వచ్చిన పంత్ -0 డక్కౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కష్టాల్లో కూరుకుపోయిన జట్టును సూర్యకుమార్ యాదవ్-39, దీపక్- చాహర్ -54 అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. ఒకానొక సమయంలో భారత్ మ్యాచ్ గెలుస్తుందనుకున్న టైంలో వీరు కూడా ఔట్ అవ్వడంతో బుమ్రా -12 మళ్లీ ఆశలు చిగురింపజేశాడు. క్షణం క్షణం ఉత్కంఠగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కలిసిరాని కేప్‌టౌన్..
టీమిండియాకు కౌప్‌టౌన్ పిచ్ పెద్దగా కలసిరావడం లేదని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లోనూ భారత్ అటు తొలుత బ్యాటింగ్, ఛేదనలోనూ వెనకబడింది. పేస్‌కు అనుకూలంగా ఉండే ఈ పిచ్ పై మన బౌలర్లు తేలిపోయారు. అడపాదడపా వికెట్లు తీసినా సఫారీ బ్యాటర్లను నిలువరించడంలోనూ, పరుగులు ఇవ్వకుండా అడ్డుకోలేకపోయారు. భారత్ ఓటమికి కౌప్‌టౌన్ పిచ్ కూడా ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ :
స్కోర్ : 287/10 (49.5 ఓవర్లు)
బ్యాటింగ్ : డికాక్ 124 (సి) ధావన్ (బి) బుమ్రా, మలన్ (బి) చాహర్, బవుమా (ఆర్) రాహుల్, మక్రమ్ (బి) చాహర్, డస్సెన్ 52 (బి) చాహల్, మిల్లర్ 39 (బి) ప్రసిద్, పెహ్లూక్వాయో (ఆర్) పంత్, ప్రిటోరియస్ 20 (బి) ప్రసిద్, మహరాజ్ (బి) బుమ్రా, మగాలా (బి) ప్రసిద్
వికెట్ల పతనం : 8-1, 34-2, 70-3, 214-4, 218-5, 228-6, 272-7, 282-8, 287-9, 287-౧౦
బౌలింగ్ : చాహర్ (8-0-53-2), బుమ్రా (10-0-25-2), ప్రసిద్ (9.5-0-59-3), జయంత్ యాదవ్ (10-0-53-0), చాహల్ (9-0-47-1), శ్రేయస్ అయ్యర్ (3-0-21-0)
ఇండియా ఇన్నింగ్స్:
బ్యాటింగ్ : కేఎల్ రాహుల్ (సి) మలన్ (బి) ఎంగిడి, ధావన్ 61 (బి) పెహ్లూక్వాయో, విరాట్ 65 (బి) మహరాజ్, రిషబ్ పంత్ (బి) పెహ్లూక్వాయో, శ్రేయస్ అయ్యర్ 26 (బి) మగాలా, ఎస్ యాదవ్ 39 (బి) ప్రిటోరియస్, చాహర్ 54 (బి) ఎంగిడి, జయంత్ యాదవ్ (బి) ఎంగిడి, బుమ్రా (బి)పెహ్లూక్వాయో, చాహల్ (బి) ప్రిటోరియస్
వికెట్ల పతనం : 18-1,116-2,118-3,156-4,195-5,210-6,223-7,278-8,281-9,283-10
బౌలర్లు : ఎంగిడి (10-0-58-3), ప్రిటోరియస్ (9.2-0-54-2), మగాలా (10-0-69-1), మహరాజ్ (10-0-40-3), పెహ్లూక్వాయో (7-0-40-3), మక్రమ్ (3-0-21-0)