గంభీర్ హెడ్ కోచ్ అవడం గంగూలీకి ఇష్టం లేదా?. ఆ పోస్టు అర్థం ఏంటి?

by Harish |
గంభీర్ హెడ్ కోచ్ అవడం గంగూలీకి ఇష్టం లేదా?. ఆ పోస్టు అర్థం ఏంటి?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 వరల్డ్ కప్‌తో ముగియనుంది. ద్రవిడ్ తర్వాత ఆ బాధ్యతలు ఎవరు చేపడతారనే విషయంపై సందిగ్ధం నెలకొంది. ప్రధాన కోచ్ కోసం దరఖాస్తుకు బీసీసీఐ నిర్ణయించిన గడువు ఇప్పటికే ముగిసింది. గౌతమ్ గంభీర్ ముందు వరుసలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర పోస్టు పెట్టాడు.

‘కోచ్ ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే.. మార్గదర్శిగా, కనికరం లేని శిక్షణతో అతను మైదానంలో, బయట ఓ ఆటగాడి భవిష్యత్తును రూపొందిస్తాడు. కాబట్టి, కోచ్‌ను తెలివిగా ఎన్నుకోండి.’ అని గురువారం ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. గంభీరే తదుపరి హెడ్ కోచ్ అని ప్రచారం జరుగుతున్న తరుణంలో గంగూలీ ఈ పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది. గంభీర్ హెడ్ కోచ్ అవడం అతనికి ఇష్టం లేనట్టు ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ప్రధాన కోచ్ నియామకం ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. ప్రధాని కోచ్ ఎంపికకు తొందరేం లేదని, టీ20 వరల్డ్ కప్ తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇటీవల బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed