ఆఫ్ఘనిస్తాన్‌ సంచలనం.. శ్రీలంకపై ఘన విజయం

by Vinod kumar |
ఆఫ్ఘనిస్తాన్‌ సంచలనం.. శ్రీలంకపై ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకపై ఆఫ్ఘనిస్తాన్‌ సంచలన విజయం సాధించింది. రషీద్‌ ఖాన్‌ లాంటి స్టార్‌ స్పిన్నర్‌ లేకపోయినా ఆఫ్ఘన్లు.. లంకేయులకు భారీ షాకిచ్చారు. యువ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (98 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్‌డౌన్‌ బ్యాటర్‌ రహ్మత్‌ షా (55) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. లంకేయులను 6 వికెట్ల తేడాతో మట్టికరించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ 1-0 ఆధిక్యంలో వెళ్లింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. చరిత్‌ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్‌ నిస్సంక (38), దుషన్‌ హేమంత (22) ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో.. ఫజల్‌ హక్‌ ఫారూకీ, ఫరీద్‌ అహ్మద్‌ మలిక్‌ చెరో 2 వికెట్లు.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌, మహ్మద్‌ నబీ తలో వికెట్‌ తీశారు. ఆఫ్ఘనిస్తాన్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్భాజ్‌ (14) విఫలమైనా.. ఇబ్రహీం జద్రాన్‌, రహ్మత్‌ షా రెండో వికెట్‌కు 146 పరుగులు జోడించగా.. 6 వికెట్ల తేడాతో మట్టికరించారు. ఆఖర్లో కెప్టెన్‌ హస్మతుల్లా షాహిది (38), మహ్మద్‌ నబీ (27 నాటౌట్‌) బాధ్యతగా ఆడి ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించారు.

Advertisement

Next Story

Most Viewed