ఆ దిగ్గజ క్రికెటర్ క్యాప్ వేలం.. ఆక్షన్‌లో రూ.2.63 కోట్లు

by Harish |
ఆ దిగ్గజ క్రికెటర్ క్యాప్ వేలం.. ఆక్షన్‌లో రూ.2.63 కోట్లు
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ ధరించిన ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్‌‌ వేలంలో భారీ ధర పలికింది. సిడ్నీలోని బోన్‌హామ్స్ ఆక్షన్ హౌజ్‌లో మంగళవారం వేలం వేయగా దాదాపు రూ.2.63 కోట్లు పలికింది. ఈ క్యాప్‌ను బ్రాడ్‌మాన్ 1947-48‌లో భారత్‌తో మ్యాచ్‌లో ధరించాడు. మరో ప్రత్యేకత ఏంటంటే సొంతగడ్డపై బ్రాడ్‌మాన్‌కు అదే చివరి సిరీస్. ఆ సిరీస్‌లో అతను ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఒక డబుల్ సెంచరీ, రెండు శతకాలతో 715 రన్స్ చేశాడు. అదే సిరీస్‌లో 100వ ఫస్ట్ క్లాస్ సెంచరీ నమోదు చేశాడు.

ఆ క్యాప్ దాదాపు 80 ఏళ్ల నాటిది. వేలంలో క్యాప్ కోసం పోటీపడ్డారు. 10 నిమిషాలపాటు సాగిన ఆక్షన్‌లో క్యాప్ విలువ 1.35 కోట్ల నుంచి రూ. 2.11 కోట్లకు చేరింది. బయ్యర్ ప్రీమియర్ చార్జీలతో కలుపుకుని దాని విలువ రూ.2.63 కోట్లు. బ్రాడ్‌మాన్ క్యాప్‌ను వేలం వేయడం ఇదే మొదటిసారి కాదు. అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో అతను ధరించిన క్యాప్‌ను 2020లో వేలం వేయగా ఆస్ట్రేలియా వ్యాపారవేత్త రూ 2.87 కోట్లకు దక్కించుకున్నాడు. ఆసిస్‌కు 20 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన బ్రాడ్‌మాన్ 1928-48 మధ్య 52 టెస్టుల్లో 6,996 రన్స్ చేశాడు. బ్యాటింగ్ అవరేజ్ 99.94‌తో రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. అలాగే, అతని పేరిట ఉన్న సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు(12) రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

Advertisement

Next Story

Most Viewed