ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి శుభ్ మన్ గిల్

by Shiva |   ( Updated:2023-09-20 14:22:36.0  )
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి శుభ్ మన్ గిల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవలే ఆసియా కప్-2023లో అద్భుత బ్యాటింగ్ తో దుమ్ములేపిన శుభ్ మన్ గిల్ తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌ అజామ్ 857 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ 814 పాయింట్లతో ద్వితీయ స్థానంలో, సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ డసెన్ 743 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న సౌతాఫ్రిక్ వికెట్ కీపర్, సన్ రైజర్స్ పించ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed