- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాక్టర్ గా మారిన శిఖర్ ధావన్.. బాధలో గబ్బర్ ఫ్యాన్స్
దిశ, వెబ్ డెస్క్: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పోటీపడిన టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్.. ఇప్పుడు టీమ్‌లో చోటు కోల్పోయాడు. వాస్తవానికి ఐసీసీ టోర్నీల్లో కోహ్లీ, రోహిత్ కంటే మెరుగైన రికార్డు ఉన్న ధావన్‌ని కావాలనే సైడ్ చేసింది బీసీసీఐ. ఐదు నెలల క్రితం టీమిండియా ఆడిన వన్డే సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్ ధావన్, ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ చోటు కోల్పోయాడు. టీమ్‌కి దూరమైన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్‌కి ఇంకా సమయం ఉండడంతో గ్యాప్‌లో ఓ హిందీ సీరియల్‌లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు గబ్బర్.
జీ ఛానెల్‌లో ప్రసారమయ్యే హిందీ సూపర్ హిట్ సీరియల్ ‘కుండలి భాగ్య’లో ఓ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు శిఖర్ ధావన్. ఈ సీరియల్‌లో అతను ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే పోలీస్ డ్రెస్సులో శిఖర్ ధావన్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గబ్బర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఫోటోలు బయటికి వచ్చినా అతను ఐపీఎల్ 2023 ప్రోమోలో ఇలా కనిపించబోతున్నాడేమోనని అనుకున్నారంతా. అయితే సీరియల్‌లో నటించబోతున్నాడని తెలిసి గబ్బర్ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. ఐదు నెలల క్రితం టీమిండియాకి వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్ ధావన్, ఇప్పుడు సీరియల్ నటుడిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.