మయాంక్ డబుల్ సెంచరీ వృథా.. కర్ణాటకపై సౌరాష్ట్ర విక్టరీ

by Vinod kumar |   ( Updated:2023-02-12 14:45:40.0  )
మయాంక్ డబుల్ సెంచరీ వృథా.. కర్ణాటకపై సౌరాష్ట్ర విక్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: రంజీ ట్రోఫీ 2022-23 భాగంగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్.. కర్ణాటక, సౌరాష్ట్ర మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సౌరాష్ట్ర జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు ఫైనల్‌లో సౌరాష్ట్ర, బెంగాల్‌ తలపడనున్నాయి. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులు చేసింది.

అనంతరం సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 527 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర ముందు 117 పరుగుల లక్ష్యం నిలిచింది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. 429 బంతుల్లో 249 పరుగులు చేశాడు. ఇందుల్లో 28 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఫిబ్రవరి 16న ఫైనల్ మ్యాచ్ సౌరాష్ట్ర జట్టు బెంగాల్‌తో ఢీ కొట్టనుంది.

Also Read...

భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో అప్‌డేట్.. మూడో టెస్టు మ్యాచ్ వేదిక మార్పు..?

Advertisement

Next Story