భారత స్టార్ షట్లర్ అరుదైన ఘనత..

by Vinod kumar |
భారత స్టార్ షట్లర్ అరుదైన ఘనత..
X

న్యూఢిల్లీ : భారత స్టార్ షట్లర్, తెలుగు కుర్రాడు సాత్విక్‌ సాయిరాజ్ రాంకీరెడ్డి అరుదైన ఘనత సాధించాడు. బ్యాడ్మింటన్‌లో ఫాస్టెస్ట్ షాట్ ఆడిన పురుష ప్లేయర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. గంటకు 565 కి.మీ వేగంతో షాట్ కొట్టి సాత్విక్ తన పేరిట ఈ రికార్డును లిఖించుకున్నాడు. ఈ విషయాన్ని జపాన్‌కు చెందిన స్పోర్ట్స్ పరికరాల తయారీ కంపెనీ యోనెక్స్ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ 14న వరల్డ్ రికార్డు ప్రయత్నం జరగగా.. అధికారిక జడ్జీలు తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను ధ్రువీకరించారని పేర్కొంది. గంటకు 565 కి.మీ వేగంతో సాత్విక్ ఆడిన షాట్ పురుషుల బ్యాడ్మింటన్‌లో కొత్త రికార్డును నమోదు.

ఇప్పటివరకు 2013లో మలేసియాకు చెందిన టాన్ బూన్ హియోంగ్ గంటకు 493 కి.మీ వేగంతో ఆడిన షాటే వేగవంతమైనదిగా ఉండగా.. తాజాగా సాత్విక్ 10 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. సాత్విక్ ఆడిన హిట్ ఫార్ములా 1 కార్ స్పీడ్ గరిష్ట వేగం గంటకు 372 కి.మీ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. అలాగే, మహిళల బ్యాడ్మింటన్‌లో మలేసియాకు చెందిన టాన్ పెర్లీ అత్యంత వేగవంతమైన షాట్ ఆడిన క్రీడాకారిణిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఆమె గంటకు 438కి.మీ వేగంతో షాట్ ఆడింది. కాగా, పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే. చిరాగ్ శెట్టితో కలిసి అతను ఈ ఏడాది ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ గెలుచుకుని చరిత్ర సృష్టించిన విషయంతెలిసిందే. అలాగే, ఈ జోడీ స్విస్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్ టైటిల్స్‌ సాధించారు.

Advertisement

Next Story

Most Viewed