- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ20 వరల్డ్ కప్‌లో అతనే ఎక్స్-ఫ్యాక్టర్ ప్లేయర్ : కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టిన రైనా
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ ఎక్స్-ఫ్యాక్టర్ ప్లేయర్‌గా మారతాడని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రైనా మాట్లాడుతూ.. శాంసన్‌కు మద్దతు పలికాడు. ‘ఇటీవల సౌతాఫ్రికాపై సంజూ అద్భుతమైన సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ రోల్ కోసం మనకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్, జితేశ్ శర్మ, ఇషాన్ కిషన్. పంత్ కోలుకుని ఫిట్‌నిస్ సాధిస్తే అతను కూడా పోటీలో ఉంటాడు. కానీ, నేను మాత్రం మిడిలార్డర్‌లో సంజూను ఎంచుకుంటాను. అతను మంచి షాట్లు ఆడగలడు. పేసర్లపై చక్కగా పిక్-అప్ షాట్లు బాదగలడు. ఐపీఎల్ అతను బాగా రాణించి సెలెక్టర్లు దృష్టిలో పడతాడని ఆశిస్తున్నా. అలాగే, అఫ్గాన్‌తో సిరీస్ కూడా అతనికి మంచి అవకాశం.’ అని రైనా చెప్పుకొచ్చాడు. ఇటీవల భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. రిషబ్ పంత్‌ను ఎంపిక చేయాలని సూచించిన విషయం తెలిసిందే. అతను ఫిట్‌గా లేకుంటే కేఎల్ రాహుల్‌ను తీసుకోవచ్చని చెప్పాడు. కాగా, టీ20 వరల్డ్ కప్‌కు మరో ఐదు నెలలు సమయం ఉన్నది. ఇప్పటికే టీమ్ ఇండియా ఆ దిశగా సన్నద్ధత మొదలుపెట్టగా.. ఆఫ్ఘనిస్తాన్‌తో చివరి టీ20 సిరీస్ ఆడుతుంది. మరోవైపు, పొట్టి ప్రపంచకప్ బెర్త్‌ల కోసం టీమ్ ఇండియాలో భారీ పోటీ ఉంది.