- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సానియా డివోర్స్ విషయంలో బిగ్ ట్విస్ట్.. అసలు విషయం బయటపెట్టిన టెన్నిస్ స్టార్ తండ్రి
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణీ సానియా మీర్జా భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నాడు. స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మాలికే వెల్లడించాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇవాళ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే, గత కొన్ని రోజులుగా షోయబ్ మాలిక్, సానియా విడాకులు తీసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఈ జోడి ఎక్కడ ఓపెన్ కాలేదు. దీంతో వీరు విడాకులు తీసుకున్నారా..? లేదా..? అన్నది సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. ఇదిలా ఉండగానే ఇవాళ అనూహ్యంగా మాలిక్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో షోయబ్, సానియా విడాకులు తీసుకున్నారా లేదా..? సానియాకు డివోర్స్ ఇవ్వకుండానే షోయబ్ మరో పెళ్లి చేసుకున్నాడా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో సానియా విడాకులపై ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా కీలక ప్రకటన చేశారు. తన కూతురు సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు. షరియా చట్టంలోని ఖులా పద్దతిలో సానియానే షోయబ్‌కు డివోర్స్ ఇచ్చిందని తెలిపారు. షరియా చట్టంలోని ఖులా పద్దతి ప్రకారం.. ముస్లిం స్త్రీ తన భర్తకు విడాకులు ఇచ్చే స్వేచ్ఛ ఉందని.. దాని ప్రకారమే సానియా కూడా అతడికి డివోర్స్ ఇచ్చిందని స్పష్టం చేశారు. సానియా తండ్రి ప్రకటనతో సానియా విడాకులపై క్లారిటీ వచ్చింది. కాగా, గత కొంత కాలం నుండి వీరిద్దరి డివోర్స్ తీసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా వీరు ఒకరికి ఒకరు దూరంగా ఉండటం.. సోషల్ మీడియాలో అకౌంట్లలో ఫొటోలు, పేర్లు తొలగించడం వంటివి చేశారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఇవాళ సానియా, మాలిక్ డివోర్స్‌పై క్లారిటీ వచ్చింది.