- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > స్పోర్ట్స్ > డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లు సాధించిన తెలుగమ్మాయిలు సహజ, శ్రీవల్లి
డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లు సాధించిన తెలుగమ్మాయిలు సహజ, శ్రీవల్లి
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : తెలుగమ్మాయిలు, హైదరాబాద్‌కు చెందిన యామలపల్లి సహజ, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. ముంబై ఓపెన్ రెండో రౌండ్‌లో వీరు ఓడిపోయినప్పటికీ.. తొలి రౌండ్‌లో తమ కంటే మెరుగైన ర్యాంకర్లను ఓడించారు. దీంతో తమ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లను పొందారు. టోర్నీకి ముందు 336వ ర్యాంక్‌లో ఉన్న సహజ 14 స్థానాలు ఎగబాకి 322వ ర్యాంక్‌కు చేరుకుంది. అలాగే, శ్రీవల్లి ఏకంగా 45 స్థానాలను అధిగమించి 475వ ర్యాంక్‌లో నిలిచింది. మరో భారత క్రీడాకారిణి రుతుజ 17 స్థానాలను దాటి 329వ ర్యాంక్‌కు చేరుకుంది. అంకిత రైనా 223వ ర్యాంక్‌తో భారత్ తరపున టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది.
Advertisement
Next Story