క్వార్టర్స్‌కు ముగ్గురు బాక్సర్లు.. ఒలింపిక్స్ బెర్త్‌కు చేరువ

by Harish |
క్వార్టర్స్‌కు ముగ్గురు బాక్సర్లు.. ఒలింపిక్స్ బెర్త్‌కు చేరువ
X

దిశ, స్పోర్ట్స్ : బ్యాంకాక్‌లో జరుగుతున్న వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫికేషన్ టోర్నీలో భారత బాక్సర్లు ఒలింపిక్ బెర్త్ దిశగా సాగుతున్నారు. సచిన్ సివాచ్(57 కేజీలు), సంజీత్ కుమార్(92 కేజీలు), అమిత్ పంఘల్(51 కేజీలు) తమ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్ బౌట్‌లో వీరు విజయాలు నమోదు చేశారు. సచిన్ 5-0 తేడాతో తుర్కియే బాక్సర్ బతుహాన్ సిప్ట్సీను చిత్తు చేశాడు. సంజీవ్ సైతం అంతే తేడాతో లూయిస్ శాంచెజ్(వెనిజులా)ను మట్టికరిపించాడు. ఇక, అమిత్ 4-1 తేడాతో మెక్సికోకు చెందిన మారిసియో రూయిజ్‌ను ఓడించాడు.

ఉమెన్స్ విభాగంలో జైస్మిన్ శుభారంభం చేసింది. 57 కేజీల కేటగిరీలో ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో ఆమె 5-0 తేడాతో అజర్‌బైజన్ క్రీడాకారిణి మహాసతి హంజయేవాను మట్టికరిపించింది. ఈ కేటగిరీలో పర్వీన్ హుడా ఇప్పటికే ఒలింపిక్ బెర్త్ సాధించింది. అయితే, ఆచూకీ తెలపడంలో విఫలమైన ఆమెపై వాడా సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో పర్వీన్ ఒలింపిక్ బెర్త్ కోల్పోయిన విషయం తెలిసిందే. 57 కేజీల కేటగిరీలో తిరిగి ఒలింపిక్ బెర్త్‌ను దక్కించుకునేందుకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ టోర్నీలో జైస్మిన్‌ బరిలోకి దింపింది. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి ఇదే చివరి టోర్నీ.

Advertisement

Next Story

Most Viewed