లారా కంటే సచిన్ గొప్ప క్రికెటర్.. కానీ: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ అలీ బచర్

by samatah |
లారా కంటే సచిన్ గొప్ప క్రికెటర్.. కానీ: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ అలీ బచర్
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దిగ్గజాలలో సచిన్ టెండూల్కర్ ఒకరు.1989లో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్ 2013లో రిటైర్మెంట్ తీసుకునక్న విషయం తెలిసిందే. తన కెరీర్‌లో అనేక రికార్డులను నెలకొల్పారు. అంతేగాక వ్యక్తిత్వంలోనూ అతన్ని మించిన వారు లేరు. అయితే, తాజాగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ అలీ బచర్ ఓ ఇంటర్వ్యూలో సచిన్‌పై ప్రశంసలు కురిపించారు.‘సచిన్ అత్యుత్తమ ఆటగాడు. గొప్ప ఇన్నింగ్సులు ఎన్నో ఆడాడు. గ్రౌండులోనూ అణిగిమణిగి ఉండేవాడు. ఎవరితోనూ గొడవపడటం ఎప్పుడూ చూడలేదు’ అని వ్యాఖ్యానించారు. కానీ ‘ఆస్టేలియన్లు సచిన్ కంటే వెస్టిండిస్ క్రికెటర్ బ్రియాన్ లారా బెటరని నమ్ముతున్నారు. ఈ విషయం ఆవేదనతో చెబుతున్నా’ అని తెలిపారు. లారా కంటే టెండూల్కరే అత్యుత్తమ ప్రదర్శనలు చేశాడని బచర్ కొనియాడారు.

Advertisement

Next Story