- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోని రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. టెస్టుల్లో అరుదైన ఘనత
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని రాజ్‌కోట్ మైదానం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో రెచ్చపోయారు. జైస్వాల్(10), శుభ్‌మన్ గిల్(0), పాటిదర్(5) ఇలా అందరూ స్వల్ప స్కోరుకే పెవీలియన్ చేరడంతో జడేతాతో కలిసి రోహిత్ శర్మ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మొత్తంగా 196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సులతో 131 పరుగులు చేశాడు. ఆ తర్వాత 64వ ఓవర్లో మార్క్ వుడ్ వేసిన బంతిని షార్ట్ ఆడబోయి స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించారు. టెస్టుల్లో అత్యధిక సిక్సులు బాదిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. టెస్టులో ఎమ్ఎస్ ధోని(78) పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. ప్రస్తుతం 91 సిక్సులతో సేహ్వాగ్ మొదటి స్థానంలో ఉండగా.. 80 సిక్సులతో రోహిత్ శర్మ రెండో స్థానానికి వచ్చాడు. దీంతో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఆపదలో జట్టును ఆదుకొని గౌరవమైన పరుగులు చేశాడని కొనియాడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టులు పెడుతున్నారు.