- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోపన్న సంచలన నిర్ణయం.. భారత టెన్నిస్‌కు గుడ్ బై
దిశ, స్పోర్ట్స్ : భారత సీనియర్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారత టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లో అనూహ్య ఓటమి అనంతరం బోపన్న తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ‘ఇది కచ్చితంగా దేశానికి నా చివరి ఈవెంట్. నేను ఎక్కడ ఉన్నానో నాకు పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నేను టెన్నిస్ సర్క్యూట్‌ను ఆస్వాదించబోతున్నా. నాకు ఇదే పెద్ద బోనస్. రెండు దశాబ్దాలుగా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని ఊహించలేదు. అందుకు చాలా గర్వపడుతున్నా.’ అని తెలిపాడు.
జాతీయ విధుల నుంచి తప్పుకున్నప్పటికీ తాను ఏటీపీ టోర్నీల్లో ఆడతానని వెల్లడించాడు. నాలుగు పదుల వయసులోనూ సంచలన ప్రదర్శన చేస్తున్న బోపన్న ఒలింపిక్స్ మెడల్ సాధించాలన్న కల మాత్రం నెరవేరలేదు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో తొలిసారి విశ్వక్రీడల్లో పాల్గొన్నాడు. పారిస్ ఒలింపిక్స్ అతనికి మూడో విశ్వక్రీడలు. 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి తృటిలో బ్రాంజ్ మెడల్ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఓడిపోయి 4వ స్థానంతో సరిపెట్టాడు. గతేడాది ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రుతుజతో కలిసి బోపన్న స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే.