- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అగ్రస్థానానికి బోపన్న.. లియాండర్ పేస్, మహేశ్ భూపతి తర్వాత ఘనత
దిశ, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నం.1గా అవతరించాడు. సోమవారం ఏటీపీ రిలీజ్ చేసిన డబుల్స్ ర్యాంకింగ్స్‌లో బోపన్న 6,605 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో బోపన్న రెండు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్‌ను సాధించాడు. 43 ఏళ్ల బోపన్న తన కెరీర్‌లో తొలిసారిగా వరల్డ్ నం.1గా నిలిచాడు. అంతేకాకుండా, వరల్డ్ నం.1 ర్యాంక్ పొందిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డుకెక్కాడు. భారత టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేసర్, మహేశ్ భూపతి, సానియా మీర్జా తర్వాత టాప్ ర్యాంక్ పొందిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు.
అగ్రస్థానం పొందడంపై బోపన్న స్పందిస్తూ..‘భారత్‌కు ఇలాంటివి అవసరం. మాకు చాలా మంది టెన్నిస్ ప్లేయర్లు లేరు. చాలా మందికి స్ఫూర్తినిస్తుందని అనుకుంటున్నా. టెన్నిస్ గురించే చెప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 40 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్లకు ఇది స్ఫూర్తినిస్తుందని అనుకుంటున్నా.’ అని బోపన్న చెప్పుకొచ్చాడు. కాగా, 43 ఏళ్ల బోపన్న ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి బోపన్న టైటిల్ గెలుచుకున్నాడు.