ఆ ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోటీ..?

by Hajipasha |
ఆ ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోటీ..?
X

న్యూఢిల్లీ: ఆసియా కప్ భారత జట్టులో రాహుల్, కోహ్లీ తిరిగి జట్టులో ఆడనున్నారు. ఈ క్రమంలో తుది జట్టులో దినేష్ కార్తీక్, రిషబ్‌ పంత్ ఇద్దరిలో ఎవరో ఒకరిని మ్యాచ్‌లో ఆడిస్తే బాగుంటుందని బీసీసీఐ అభ్రిపాయపడుతోంది. ఈ నేపథ్యంలో రిషబ్‌ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దినేష్ కార్తీక్‌కు తనకు మధ్య ఎలాంటి పోటీ లేదని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా రిషబ్‌ పంత్ మాట్లాడుతూ.. 'టీమ్ ఇండియా జట్టులో ఏ ప్లేయర్ ఉండాలి.. ఏ ప్లేయర్‌ని ఎంపిక చేయాలనే విషయం కెప్టెన్, కోచ్‌పై ఆధారపడి ఉంటుంది. మా ఇద్దరిలో ఎవరు ఆసియాకప్‌లో ఆడుతారనే విషయంపై ఏ రోజు ఆలోచించలేదు. ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కినా.. టీమ్ ఇండియా జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆడుతారు.' అని వెల్లడించారు.

ఐపీఎల్‌లో రాణించిన వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు టీమ్ ఇండియా జట్టులో చోటు దక్కింది. కార్తీక్ జట్టులోకి రావడంతో రిషబ్‌కు పోటీ నెలకొంది. వెస్టిండీస్, సౌతాఫ్రికా సిరీస్‌లకు కేఎల్ రాహుల్, విరాట్ దూరమవ్వడంతో పంత్, కార్తీక్‌కు అవకాశం దక్కింది. మేనేజ్‌మెంట్ ఇద్దరిని తుది జట్టులో ఆడించింది. పంత్‌ను వికెట్ కీపర్‌గా.. దినేష్ కార్తీక్‌ను బ్యాంటింగ్‌కు ఎంపిక చేసింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరూ మంచి ప్రదర్శనను కనబర్చారు. కాగా, ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానున్న జింబాబ్వే టూర్‌కు పంత్, దినేష్ కార్తీక్ ఎంపిక లేదు. ఈ నెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుంది.

Advertisement

Next Story

Most Viewed