ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం.. రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం

by Vinod kumar |
ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం.. రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం
X

దిశ, వెబ్‌డెస్క్: ఘోర రోడ్డు ప్రమాదంతో ఆటకు దూరమైన రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. రిషభ్ పంత్ జెర్సీ నెంబర్‌తో ఐపీఎల్ 2023 సీజన్ బరిలోకి దిగాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఢిలీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ దృవీకరించాడు. అతని జెర్సీ నెంబర్‌ను మా టీషర్టులుపై లేదా క్యాప్‌లపై ముద్రించాలని అనుకుంటున్నామని తెలిపాడు.

డిసెంబర్ 30న రిషభ్ పంత్ సొంతంగా డ్రైవ్ చేస్తున్న కారు ఢిల్లీ సమీపంలో రూర్కీ ప్రాంతంలో డివైడర్‌ను ఢీకొట్టి పూర్తిగా దగ్దమైన విషయం తెలిసిందే. ఓ బస్ డ్రైవర్, కండక్టర్ సాయంతో ప్రాణాలతో బయటపడిన రిషభ్ పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఇంటి దగ్గరే ఉంటూ.. గాయాల నుంచి కోలుకుంటున్నాడు. గాయాల తీవ్రత కారణంగా అతను సుమారు రెండేళ్ల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story