‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా రచిన్.. ఉమెన్స్‌లో హేలీ మాథ్యూస్‌‌

by Harish |
‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా రచిన్.. ఉమెన్స్‌లో హేలీ మాథ్యూస్‌‌
X

దుబాయ్: ప్రస్తుత వన్డే ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణిస్తున్న న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్ర.. అక్టోబర్ నెలకుగానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో 81.20 సగటుతో ఇప్పటివరకు 406 పరుగులు చేసిన ఈ భారత సంతతి ఆటగాడు.. ఇంగ్లాండ్‌ (123*), ఆస్ట్రేలియా(116) జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో శతకాలతో మెరిశాడు. రచిన్‌కు ఇదే తొలి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కావడం గమనార్హం.

ఇక, మహిళా క్రికెటర్లలో వెస్టిండీస్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ ఈ అవార్డు దక్కించుకుంది. మహిళల ఆల్‌రౌండర్ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న హేలీ.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 155 సగటుతో 310 పరుగులు చేసింది. రెండో టీ20లో ఏకంగా 132 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచింది.

కాగా, రచిన్ రవీంద్రతోపాటు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం బుమ్రా, క్వింటాన్ డికాక్ పోటీ పడగా, మహిళల్లో బంగ్లా బౌలర్ నహిదా అక్తర్, కివీస్ ఆల్ రౌండర్ అమేలియా కెర్‌ను అధిగమించి హేలీ అవార్డు దక్కించుకుంది. ఈ మేరకు విజేతలను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed