- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో.. అగ్రస్థానంలో టీమ్ ఇండియా స్పిన్నర్..
దుబాయ్: టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ లో నం.1 బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ 864 రేటింగ్ పాయింట్లతో అగ్రపీఠం దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 6 వికెట్ల తీసి రేటింగ్ పాయింట్లను పెంచుకున్న అశ్విన్.. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్(859)ను రెండో స్థానానికి నెట్టి టాప్ పొజిషన్‌కు చేరుకున్నాడు.
2015లో మొదటిసారి నం.1 బౌలర్‌గా నిలిచిన అశ్విన్ ఆ తర్వాత పలుమార్లు అగ్రస్థానానికి చేరుకున్నాడు. గాయం కారణంగా కొంతకాలంగా ఆటకు దూరమైన పేసర్ బుమ్రా తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకోవడం గమనార్హం. బుమ్రా 4వ ర్యాంక్‌కు చేరుకోగా.. జడేజా సైతం ఒక స్థానాన్ని అధిగమించి 8వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక, బ్యాటింగ్ విభాగంలో రిషబ్ పంత్, రోహిత్ శర్మ చెరో రెండు స్థానాలను కోల్పోయి వరుసగా 8, 9 ర్యాంక్‌లకు పడిపోయారు. ఆల్‌రౌండర్ విభాగంలో జడేజా అగ్రస్థానంలో పాతుకపోగా.. అశ్విన్ 2వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అక్షర్ పటేల్ 5వ స్థానంలో ఉన్నాడు.