- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కివీస్ కోచింగ్ స్టాఫ్‌లో చేరిన భారత మాజీ బ్యాటింగ్ కోచ్
దిశ, స్పోర్ట్స్ : భారత జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ న్యూజిలాండ్ కోచింగ్ స్టాఫ్‌లో భాగంకానున్నాడు. న్యూజిలాండ్, అఫ్గాన్ టెస్టుకు భారత్ ఆతిథ్యమిస్తున్నది. నోయిడా వేదికగా ఈ నెల 9-13 వరకు ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత గడ్డపై జరిగే ఈ టెస్టు కోసం కివీస్ విక్రమ్ రాథోడ్ సేవలను వినియోగించుకోనుంది. అలాగే, శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్‌ను తాత్కాలికంగా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. అఫ్గాన్‌తో టెస్టుతోపాటు శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు అతను తమతో పనిచేస్తాడని న్యూజిలాండ్ క్రికెట్ పేర్కొంది. ‘వరల్డ్ క్రికెట్‌లో విక్రమ్, రంగనాలకు ఎంతో పేరు ఉంది. వారి నుంచి నేర్చుకోవడానికి మా ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు.’ అని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్‌లో విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్‌తో ద్రవిడ్‌తోపాటు రాథోడ్ పదవీకాలం కూడా ముగిసింది. 1996-98 మధ్య టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన రాథోడ్ 6 టెస్టులు, 7 వన్డేలు ఆడాడు.