- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌తో టీ20 సిరీస్ నుంచి రషీద్ ఖాన్ ఔట్
దిశ, స్పోర్ట్స్ : నేటి నుంచి టీమ్ ఇండియాతో జరగబోయే టీ20 సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తప్పుకున్నాడు. సర్జరీ నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అందుకే అతను సిరీస్‌కు దూరమైనట్టు అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ తెలిపాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత రషీద్ ఖాన్ వెన్ను గాయంతో బాధపడ్డాడు. ఇటీవల సర్జరీ కూడా చేయించుకున్న అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే యూఏఈ టూరుకు అతను దూరమయ్యాడు. అయితే, అతను ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసింది. ప్రస్తుతం అఫ్గాన్ టీ20 జట్టుకు రషీద్ ఖాన్ రెగ్యులర్‌గా కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, అతని పరిస్థితిని బోర్డు దృష్టి పెట్టుకుని భారత్‌తో పర్యటనకు కేవలం అతన్ని ప్లేయర్‌గానే ఎంపిక చేసింది. అయితే, మొదటి నుంచి రషీద్ ఖాన్ ఆడటంపై నెలకొన్న అనుమానాలు నిజమయ్యాయి. అతను టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. కానీ, అతను జట్టుతోనే ఉంటాడని కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ పేర్కొన్నాడు. ఈ సిరీస్‌లో రషీద్ ఖాన్ లేకపోవడం తమకు ఎదురుదెబ్బేనని, అయితే, అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు జట్టులో ఉన్నారని చెప్పాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్, కైస్ అహ్మద్‌లపై కెప్టెన్ నమ్మకం వ్యక్తం చేశాడు.