- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Ranji Trophy Final : మొదటి రోజు కుప్పకూలిన ముంబై.. ఆదుకున్న శార్దూల్ ఠాకూర్
దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో ముంబై, విదర్భ జట్ల మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. విదర్భ బౌలర్లు సమిష్టిగా రాణించి ముంబైని మొదటి రోజే మోస్తరు స్కోరుకే కూల్చేశారు. శార్దూ్ల్ ఠాకూర్(75) సత్తాచాటడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేసింది. ప్రత్యర్థిని మోస్తరు స్కోరుకే పరిమితం చేసిన విదర్భ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు కీలక వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. ధ్రువ్(0), అమన్(9), కరుణ్ నాయర్(0) దారుణంగా విఫలమయ్యారు. అథర్వ తైడే(21 బ్యాటింగ్), ఆదిత్య(0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంకా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులు వెనుకబడి ఉన్నది.
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు పృథ్వీ షా(46), భూపెన్ లాల్వానీ(37) తొలి వికెట్‌కు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అయితే, విదర్భ బౌలర్లు పుంజుకోవడంతో ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. 30 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు నష్టపోయి 111/6 స్కోరుతో నిలిచింది. ఈ పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్(75) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతను స్కోరును 200 దాటించాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో శార్దూల్ అవుటవడంతో ముంబై తొలి ఇన్నింగ్స్ ముగిసింది. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే, యశ్ ఠాకూర్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు.