ఇలా చేయడం దేశానికి మంచిది కాదు: రెజ్లర్లపై IOA President PT Usha ఆగ్రహం

by Satheesh |   ( Updated:2023-04-27 14:01:04.0  )
ఇలా చేయడం దేశానికి మంచిది కాదు: రెజ్లర్లపై IOA President PT Usha ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమను లైంగికంగా వేధిస్తున్న రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని స్టార్ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనపై ఇడియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పీటీ ఉష ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లర్లు చేస్తున్న ఆందోళన దేశానికి, ఆటకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ప్లేయర్లు ఇలా వీధుల్లోకి రావాల్సింది కాదని, ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక వచ్చే వరకు ఎదురుచూడాల్సిందని అన్నారు. క్రీడాకారుల నిరసన క్రమశిక్షణా రాహిత్యం అన్నారు.

కాగా బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేదిస్తున్నారంటూ రెజ్లర్లు ఢిల్లీలో రెండో దఫా నిరసనకు దిగారు. మరో వైపు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ క్రీడాకారులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఢిల్లీ పోలీసుల‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కాగా డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ మిస్టర్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ దానిని ఇప్పటి వరకు బహిరంగ పరచలేదు.

Advertisement

Next Story

Most Viewed