- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rishabh Pant Car Accident:నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను Virat Kohli
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇవాళ ఉదయం ఢిల్లీ నుండి రూర్కీ వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసింది. పంత్ న్యూ ఇయర్ వేడుకల కోసం ఇంటికి వెళ్తుండగా అతడి కారు ప్రమాదానికి గురైంది. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్.. తృటిలో ప్రాణపాయం నుండి బయటపడ్డాడు. బలమైన గాయాలు కావడంతో ప్రస్తుతం పంత్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. టీమిండియాలో అందరితో సరదాగా ఉండే పంత్‌కు యాక్సిడెంట్ అయ్యిందన్న విషయం తెలియగానే.. అతడు త్వరగా కోలుకోవాలని సహచర క్రికెటర్లు ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పంత్‌కు యాక్సిడెంట్ అయ్యిందన్న విషయం తెలియడంతో ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ''తొందరగా కోలుకో రిషబ్ పంత్.. నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను'' అని ట్వీట్ చేశాడు.
ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. పంత్ నుదిటిపై రెండు గాయాలు, కుడి మోకాలిలో చీలిక, కుడి మణికట్టు, చీలమండ, బొటనవేలుకు గాయాలు అయినట్లు వెల్లడించారు. అతని వీపుపై కూడా గాయాలు అయినట్లు తెలిపారు. పంత్‌కు చికిత్స చేస్తున్న వైద్యులతో, అతడి కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.