పీకేఎల్‌లో కొత్త చాంపియన్.. ఆ జట్టుదే టైటిల్

by Harish |
పీకేఎల్‌లో కొత్త చాంపియన్.. ఆ జట్టుదే టైటిల్
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)‌లో కొత్త చాంపియన్‌ అవతరించింది. 10వ సీజన్ టైటిల్‌ను పుణేరి పల్టాన్ ఎగరేసుకపోయింది. లీగ్ చరిత్రలో ఆ జట్టు చాంపియన్‌గా నిలవడం ఇదే తొలిసారి. హైదరాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పుణేరి పల్టాన్ 28-25 తేడాతో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది. మొదటి నుంచి రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో 3 పాయింట్ల తేడాతో పుణేరి పల్టాన్ విజేతగా నిలిచింది. ఫస్టాఫ్‌లో పుణేరి పల్టాన్ 13-10తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదురైనా చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకుంది. పంకజ్ మోహితే 9 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story